శ్రీశైల క్షేత్రంలో జరిగిన కుంభకోణంపై అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)తో విచారణ జరిపించేందుకు దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు. ఆన్‌లైన్ టికెట్ల విక్రయాలు, దాతల నుంచి విరాళాల సేకరణ తదితర విషయాల్లో 2016 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు అక్రమాలు జరిగాయి. వీటిపై జరిగిన ప్రాథమిక విచారణలో రూ.2.52 కోట్ల మేర స్వాహా అయినట్లు తేలింది. ఈ మేరకు బాధ్యులైన ఆలయ ఉద్యోగులను సస్పెండ్ చేసి పొరుగు సేవల సిబ్బందిని తొలగించి కేసులు నమోదు చేశారు. ఈ అక్రమాలపై అనిశా విచారణ జరిపి 3 నెలల్లో నివేదిక అందజేయాల్సి ఉంటుంది.
శ్రీశైలం కుంభకోణంపై అనిశాతో విచారణ - శ్రీశైలం కుంభకోణంపై ఏసీబీతో విచారణ వార్తలు
శ్రీశైల దేవస్థానంలో జరిగిన కుంభకోణంపై అనిశాతో విచారణ జరిపించేందుకు దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు. ఈ అక్రమాలపై ఏసీబీ విచారణ జరిపి 3 నెలల్లో నివేదిక అందజేయాల్సి ఉంటుంది.
srisailam