ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 14, 2020, 6:19 PM IST

ETV Bharat / state

రిజిస్ట్రేషన్‌ శాఖపై కరోనా ప్రభావం

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరైన స్టాంప్స్, రిజిస్ట్రేషన్‌ శాఖపై కరోనా ప్రభావం పడింది. నిత్యం రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేది. గతేడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ అమలులోకి రావడంతో ఆదాయంపై ప్రభావం చూపింది. ప్రస్తుతం కరోనా కారణంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.

kurnool district
రిజిస్ట్రేషన్‌ శాఖపై కరోనా ప్రభావం

కరోనా ప్రభావం రాష్ట్రమంతట చూపుతోంది. లాక్ డౌన్ అమలవుతున్న వేళ లావాదేవిలు స్తంభించిపోయాయి. రిజిస్ట్రేషన్‌ శాఖపై కరోనా పడగ విప్పింది. నిర్దేశిత లక్ష్యన్ని చేరుకోకపోగ తీవ్ర నష్టాలు చవి చూస్తోంది.

కర్నూలు జిల్లాలో 24 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. స్థిరాస్తి క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రతిరోజు ప్రభుత్వానికి రూ.కోటి నుంచి రూ.1.50 కోట్ల వరకు ఆదాయం లభించేది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి జిల్లా శాఖకు రూ.363.09 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రూ.261.75 కోట్ల ఆదాయం సమకూరింది. మార్చి 20 వ తేదీ వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగటంతో మరో రూ.17 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఆ తర్వాత జిల్లాలో లాక్‌డౌన్‌ అమలులోకి రావటం.. ఆన్‌లైన్‌ సర్వర్‌ పనిచేయకపోవటంతో జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సేవలు ఆగిపోయాయి. దీంతో జిల్లా స్టాంప్స్, రిజిస్ట్రేషన్‌ శాఖ కేవలం రూ.278.84 కోట్లను మాత్రమే ఆర్జించి ఆదాయ లక్ష్యాన్ని సాధించలేకపోయింది. జిల్లాలో ఆస్పరి, బండి ఆత్మకూరు, నందికొట్కూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు మాత్రమే నిర్దేశించిన లక్ష్యాన్ని ఫిబ్రవరి నెలకే సాధించటం విశేషం. ఎన్నికలు, కరోనా ప్రభావం లేకపోయింటే లక్ష్యాన్ని సాధించేవారమని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.


నాడు ఎన్నికలు.. నేడు కరోనా..
జిల్లా స్టాంప్స్, రిజిస్ట్రేషన్‌ శాఖ ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి ఆటుపోట్లను ఎదుర్కొంది. 2019లో సార్వత్రిక ఎన్నికల కారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో క్రయవిక్రయాలు భారీగా తగ్గిపోయాయి. స్థిరాస్తి వ్యాపారం మీద ప్రభావం చూపింది. ఫలితంగా ఆ మూడు నెలలపాటు ఆశించిన స్థాయిలో ఈ శాఖకు ఆదాయం రాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ అమలులోకి రావటంతో నగదు బదిలీకి ఇబ్బందిగా మారి రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో మార్చి 20 నుంచి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సేవలు ఆగిపోయాయి. ఫలితంగా రోజూ రూ.కోటి చొప్పున జిల్లా శాఖ నుంచి ఖాజానాకు జమ కావాల్సిన ఆదాయం ఆగిపోయింది.

ఇది చదవండిఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో పేదలకు సరుకుల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details