రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న, నిల్వ చేసిన మద్యం, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గుంటూరు జిల్లా
గుంటూరు జిల్లా మంగళగిరిలో గంజాయి విక్రయిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి నాలుగున్నర కేజీల గంజాయిని స్వాధీనం చేశారు. వీరంతా పదిహేడేళ్లలోపు వారే అని పోలీసులు తెలిపారు.
కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లాలో అక్రమంగా మద్యం, గుట్కా వ్యాపారం చేస్తున్న 10మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.12.5లక్షల విలువైన మద్యం, రూ.7.5 లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐదు ఆటోలను, మూడు ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు.