ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

woman try to suicide in Srisailam: శ్రీశైలంలో హైదరాబాద్​కు చెందిన వివాహిత ఆత్మహత్యాయత్నం - శ్రీశైలంలో వివాహిత ఆత్మహత్యాయత్నం

శ్రీశైలంలో హైదరాబాద్​కు చెందిన వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం(woman try to suicide) చేసింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

suicide
suicide

By

Published : Nov 25, 2021, 11:00 AM IST

Updated : Nov 25, 2021, 3:31 PM IST

శ్రీశైలంలో స్థానిక దుకాణాల వద్ద మౌనికారెడ్డి అనే వివాహిత ఆత్మహత్యాయత్నం(suicide in Srisailam) చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఈ మహిళ పురుగులమందు తాగింది. వెంటనే స్థానికులు ఆమెను 108 అంబులెన్స్​లో సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధిత మహిళ వద్ద పోలీసు ఫిర్యాదు కాపీ లభ్యమైంది.

బాధిత మహిళ వద్ద లభించిన పోలీసులకు ఫిర్యాదు చేసిన కాపీ


వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మౌనికా రెడ్డి వద్ద అక్టోబర్ నెలలో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాపీ లభించింది. ఆమె ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసిందో తెలియరాలేదు. బాధితురాలి తండ్రి సున్నిపెంట ఆసుపత్రికి చేరుకున్నారు. శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:visaka accident: జాతీయ రహదారిపై ప్రమాదం...సీఐ ఈశ్వరరావు మృతి

Last Updated : Nov 25, 2021, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details