దంపతుల మధ్య ఘర్షణ.. భార్యను నరికి చంపిన భర్త
ఓ భర్త తన భార్యను దారుణంగా హత్యచేశాడు. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో కోపంతో రగిలిపోయిన భర్త గొడ్డలితో కిరాతకంగా భార్యను నరికాడు. ఆమె అక్కడికక్కడే మరణించింది.
husband-killed-wife
కర్నూలు జిల్లాలో భర్త తులసిదాస్, భార్య పద్మావతిని దారుణంగా హత్య చేశాడు. కోసిగి మండలం కందుకూరు గ్రామంలో భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగింది. భర్త కోపంతో భార్యను గొడ్డలితో నరికి చంపాడు. ఆస్తిని పిల్లలకు ఇవ్వాలని భార్య కోరడం వల్ల ఆవేశంతో ఆమెను నరికినట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.