Husband committed suicide by jumping from the building: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ శివారు నార్సింగిలో విషాదం చోటు చేసుకుంది. భార్య చూస్తుండగానే భర్త భవనం పైనుంచి దూకేశాడు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పీరంచెరువు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం రేవన్ సిద్ధప్ప అనే వ్యక్తికి తన భార్యతో చిన్నపాటి గొడవ జరిగింది.
భార్యతో గొడవ.. భవనం పైనుంచి దూకేసిన భర్త
Husband committed suicide by jumping from the building: పెళ్లినాటి ప్రమాణాల్లో కష్టసుఖాల్లో చనిపోయే వరకూ ఒకరికొకరు తోడుగా ఉంటామని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భార్యాభర్తలు.. వారి మధ్య అప్పుడప్పుడు వచ్చిన చిన్న చిన్న వివాదాలతో క్షణికావేశానికి గురై జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన పరిస్థితుల్లో సైతం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటి ఘటనే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని నార్సింగిలో జరిగింది.
భర్త ఆత్మహత్యాయత్నం
ఈ క్రమంలో తీవ్ర ఆవేదనకు గురైన రేవన్ సిద్ధప్ప.. ఒక్కసారిగా భవనం పైనుంచి కిందికి దూకాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేవన్ మృతి చెందాడు. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: