కాళ్లు లేని భార్యను మోస్తూ భర్త సాగిస్తున్న ప్రేమ ప్రయాణం అనురాగానికి నిదర్శనం. మహేంద్రది కర్ణాటకలోని బళ్లారి, అన్నపూర్ణది అదే రాష్ట్రం కోప్పలు జిల్లా. అన్నపూర్ణ పోలియో వల్ల నడవలేని పరిస్థితి. ఏడాది కింద వీరిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం బళ్లారిలో ఉంటున్నారు. కూలి పనులు చేస్తూ భార్యను పోషిస్తున్నాడు మహేంద్ర. తాను ఎక్కడకు వెళ్లినా భార్యను చంకన వేసుకుని తీసుకెళ్తారు. వేరే ప్రాంతానికి వెళ్లడానికి భార్యను ఎత్తుకుని కర్నూలు జిల్లా ఆదోనికి వచ్చారు. ఏదైనా ఉపాధి చూపిస్తే భర్తకు అండగా ఉండగలనని అన్నపూర్ణ అంటున్నారు.
'దివ్య'మైన ప్రేమ ప్రయాణం - ఏపీ టుడే వార్తలు
కోటి మాటలెందుకు.. గుప్పెడు ప్రేమ చాలదా ఈ జీవితానికి అనిపిస్తుంది ఆ దంపతులను చూస్తే! కాళ్లు లేని ఆమెను మోస్తూ అతను సాగిస్తున్న ప్రేమప్రయాణం అనురాగానికి నిదర్శనం. ఏడాది కిందట పెద్దల అంగీకారంతో ప్రేమపెళ్లి చేసుకున్న వీరిద్దరూ...అప్పటినుంచి ప్రేమప్రయాణం సాగిస్తూనే ఉన్నారు. చిన్నతనంలో పోలియోతో కాళ్లు కోల్పోయిన ఆమెను మోస్తూ....ఉపాధి ఎక్కడ ఉంటే అక్కడకు ప్రయాణం చేస్తున్నారు.
Husband carriers disabled wife