ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంతానం కలగలేదని.. భార్య కాలు, చేయి విరిచిన భర్త..! - సంతానం కలగలేదని భార్యపై భర్త విచక్షణారహితంగా దాడి

Husband broke his wife's hand and a leg: వివాహం జరిగి మూడేళ్లు కావస్తున్నా పిల్లలు పుట్టడం లేదని భార్యపై విచక్షణరహితంగా దాడి చేశాడో ప్రభుద్దుడు. అంతటితో ఆగకుండా.. ఆమె కాళ్లు, చేతులను విరిచేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. తమ కుమార్తెపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన భర్త, ఆయన కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

సంతానం కలగలేదని.. భార్య కాలు చేయి విరిచిన భర్త
Husband broke his wife's hand and a leg

By

Published : Dec 28, 2022, 11:24 AM IST

Updated : Dec 28, 2022, 12:33 PM IST

Husband broke his wife's hand and a leg In AP: పెళ్లై మూడు సంవత్సరాలవుతున్నా, పిల్లలు పుట్టడం లేదని తన భార్యపై కక్షపెంచుకున్నాడు ఆ వ్యక్తి. అతనికి తోడు తల్లిదండ్రులు సైతం వంతపాడటంతో.. మరింతగా రెచ్చిపోయాడు. తరచూ గొడవ పడుతూ ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. అతని ఆగడాలను భరిస్తూ వస్తుందనే అలుసో, లేక తనను తప్పించు కోవాలనే ఉద్దేశమో కానీ ఒక్కసారిగా కట్టుకున్న భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అతని దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది.

పిల్లలు పుట్టలేదని భార్య కాలు చేయి విరిచిన భర్త

సంతానం కలగలేదనే కోపంతో భార్యపై భర్త విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లా డోన్‌ మండలం చనుగొండ్లలో మంగళవారం జరిగింది. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తెను తల్లిదండ్రులు పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చందోలి గ్రామానికి చెందిన లాలప్ప, ఆదిలక్ష్మిల కుమార్తె భవానీని డోన్‌ మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన రాముకు ఇచ్చి మూడేళ్ల కిందట వివాహం జరిపించారు. పెళ్లైన నాటి నుంచి తమ కుమార్తెను వేధింపులకు గురిచేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు.

సంతానం కలగలేదనే కారణంతో భర్త, అత్తింటి వారు చిత్రహింసలకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. మంగళవారం విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా కాలు, చేయి విరిచేశారన్నారు. చావు బతుకుల మధ్య ఉందని సమాచారం తెలియటంతో.. అక్కడికి వెళ్లి తమ కుమార్తెను ఆటోలో తీసుకొచ్చామన్నారు. పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు తరలించారు. తమ కుమార్తెపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన భర్త, ఆయన కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

'మా అమ్మాయికి పెళ్లై మూడు సంవత్సరాలు అవుతుంది. పిల్లలు పుట్టడం లేదని వారిద్దరిని ఆసుపత్రిలో చూపించాము. పిల్లలు పుట్టడం లేదని మా అమ్మాయిపై దాడి చేశాడు. దెబ్బలు తీవ్రంగా ఉండటంతో కర్నూలు ఆసుపత్రికి పంపించారు. పిల్లలు పుట్టడం లేదని వారు అంటున్నారే కానీ.. ఒక్కసారి కూడా ఆసుపత్రిలో చూపించింది లేదు. అత్తింటి వారు ఎప్పుడైనా ఆసుపత్రిలో చూపించారో వాళ్లను అడగండి. మా అమ్మాయి పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన భర్త, ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు చర్యలు తీసుకోవాలి.'- భవానీ తండ్రి

Last Updated : Dec 28, 2022, 12:33 PM IST

ABOUT THE AUTHOR

...view details