లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించి హుక్కా ఆడుతున్న 12 మందిని కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు అదుపులో తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణంలోని మట్కార్ గేరీలోని న్యాయవాది ఇంట్లో పోలీసులు దాడులు చేశారు. కరోనా నిబంధనలు పట్టించుకోకుండా... ఇంట్లో 12 మంది అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ, హుక్కా పీల్చుతూ పోలీసులకు పట్టుబడ్డారు. 144 సెక్షన్ అమలు ఉండడం, కరోనా వ్యాప్తి చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉండటం వల్ల... వీరిపై కేసు నమోదు చేశామని ఒకటో పట్టణ సీఐ చంద్రశేఖర్ తెలిపారు.
హుక్కా ఆడుతున్న 12 మంది అరెస్ట్ - కర్నూలు జిల్లా తాజా క్రైం న్యూస్
కర్నూలు జిల్లా ఆదోనిలో లాక్డౌన్ ఉల్లంఘించి ఓ ఇంట్లో హుక్కా ఆడుతున్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేశారు.
హుక్కా పీల్చుతున్న 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు