ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థినులతో.. వార్డెన్ కుమారుడి అసభ్య ప్రవర్తన - kurnool

వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థినుల సంరక్షణ బాధ్యత.. అక్కడ పనిచేసే వార్డెన్లదే. అలాంటి వార్డన్ కుమారుడే అసభ్యంగా ప్రవర్తిస్తే.. అక్కడి అమ్మాయిలు ఎవరికి చెప్పుకోవాలి? కర్నూలు జిల్లాలో జరిగిన ఈ సంఘటన.. వసతి గృహాల నిర్వహణలో లోపాలు ఎత్తి చూపుతోంది.

విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన

By

Published : Jul 13, 2019, 5:01 PM IST

విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన

కర్నూలు జిల్లా పాణ్యంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో.. విధులు నిర్వర్తిస్తున్న వార్డెన్​తో పాటు ఆయన కుమారుడు అక్కడే నివసిస్తున్నాడు. వసతి గృహంలో ఉంటున్న విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. వార్డెన్ కుమారుడి గురించి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విద్యార్థి సంఘాలు, పలు వర్గాల నాయకులు ధర్నా చేశారు. వార్డెన్ తో పాటు.. అతని కుమారుడిపై చర్యలు తీసుకోవాలన్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details