ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో భారీ వర్షం...వరద నీటిలో 9 మండలాలు - కర్నూలు జిల్లాలో భారీ వర్షం

భారీ వర్షాల కారణంగా కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ పరిధిలోని 9  మండలాల్లో  వరద ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు కట్టుబట్టలతో ఇళ్లలోంచి వచ్చేసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నంద్యాలలో భారీ వర్షం

By

Published : Sep 18, 2019, 10:00 AM IST

భారీ వర్షాల తో కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ పరిధిలోని 9 మండలాల్లో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నంద్యాల, గోస్పాడు, సిరివెల్ల, మహనంది, ఆళ్లగడ్డ, దొరినిపాడు, ఉయ్యాలవాడ, చాగలమర్రి, పాణ్యం తదితర మండలాల్లో పలు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు దెబ్బతిన్నాయి. పంటనష్టం తీవ్రంగా జరిగింది. పశువులు మృతి చెందాయి మహనందికి రాకపోకలు స్తంభించాయి ఇప్పటివరకు 9000 ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఎన్జీవో కాలనీ, విశ్వనగర్, సరస్వతి నగర్, హానీఫ్ నగర్, సలింనగర్ తదితర కాలనీల్లో నీరు చేరాయి. వరద గ్రామాల్లో సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ రవి పఠాన్ శెట్టి తెలిపారు.

కర్నూలులో భారీ వర్షం...వరద నీటిలో చిక్కుకున్న 9మండలాలు

ABOUT THE AUTHOR

...view details