ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు - కర్నూలు జిల్లా తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. వాన రాకతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గాజులదిన్నె ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది.

heavy rain in kurnool district
heavy rain in kurnool district

By

Published : Jul 25, 2020, 8:45 AM IST

కర్నూలు జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు నగరం సహా దేవనకొండ, హాలహర్వి, ఓర్వకల్లు, జూపాడు బంగ్లా, పత్తికొండ, హొళగుంద, సి.బెళగల్, ఆస్పరి, బండి ఆత్మకూరు, గోనెగండ్ల మండలాల్లో భారీ వర్షం పడుతోంది. వాన రాకతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

గాజులదిన్నె ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి

ఆస్పరి మండలం పలుకూరు బండ ములుగుందం రహదారిలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వంతెన కొట్టుకుపోయింది. పలు గ్రామాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. హాలహర్వి మండలంలోని ఊరివంక వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. హాళహర్వి ఎస్సీ కాలనీలోకి వరద నీరు చేరటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. హాళహర్వి- నిట్రవట్టి, గుల్లెం- సిద్ధాపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు గాజులదిన్నె ప్రాజెక్టుకు 60 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details