కర్నూలు జిల్లా గోస్పాడులో కురిసిన భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. 22 సెంటీమీటర్ల వర్షం కురవటంతో పలు రహదారులు దెబ్బతిన్నాయి. గోస్పాడు, యాళ్లూరు గ్రామాల్లో ఇళ్ళలోకి నీరు చేరగా, కొంత సమయం విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. వానతో గ్రామాల్లోని పదుల సంఖ్యలో గేదెలు మృతి చెందాయి. మండలంలో 4800 ఇళ్ళలోకి వాన నీరు చేరినట్టు ప్రాథమిక సమాచారం. వర్షం కారణంగా తీవ్రంగా పంట నష్టం జరిగిందని స్థానికులంటున్నారు.
కర్నూలులో భారీ వర్షం..నీట మునిగిన ఇళ్లు
భారీ వర్షం కారణంగా కర్నూలు జిల్లాలోని పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. ఇళ్లలో నీరు చేరగా తీవ్రంగా పంట నష్టం వాటిల్లింది.
కర్నూలులో భారీ వర్షం..నీట మునిగిన ఇళ్లు