హైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్‌రావు, అతని సోదరుల అపహరణ కేసులో.. కీలక వివరాలు రాబట్టేందుకు పోలీసులు అన్ని అవకాశాలు ప్రయత్నిస్తున్నారు. జైలులో ఉన్న బోయ సంపత్, మల్లికార్జున్‌రెడ్డి, బాల చెన్నయ్యను విచారణ నిమిత్తం 7 రోజులపాటు అప్పగించాలని కోరుతూ బోయిన్‌పల్లి పోలీసుల తరఫున న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ దాఖలైంది. ఈ విషయాన్ని సికింద్రాబాద్ 11వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేశ్‌కుమార్ వెల్లడించారు. ఈ పిటిషన్‌తోపాటు రాష్ట్ర మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం ఈనెల 18న విచారణ జరపనుందని నరేశ్‌కుమార్ పేర్కొన్నారు.
అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై 18న విచారణ - బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ అరెస్టు న్యూస్
బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై 18న విచారణ జరగనుంది. మరోవైపు జైలులో ఉన్నవారిని విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై 18న విచారణ