కర్నూలులో పోలీసుల గస్తీలో 3 తుపాకులు, 3 తుటాలు దొరికాయి. నగర శివారు జోహరాపురంలో శ్రీరామాంజనేయస్వామి గుడి వెనక పాడుబడిన గోడ వద్ద ఒక రివాల్వార్, మొగల్ పుర వీధిలో ఓ ఇంట్లో ఒక తపంచ లభించాయి. కొలిమిగుండ్ల మండలం తుమ్మల పెంట సమీపంలో లొక్కి రామేశ్వర గుడి వెనుక ప్లాస్టిక్ సంచిలో ఉంచిన ఒక 303 రైఫిల్, 3 తూటాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి... నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసు గస్తీలో 3 తుపాకులు, తూటాలు గుర్తింపు - kurnool
కర్నూలు నగరంలో మూడు ప్రాంతాల్లో పోలీసులు 3 తుపాకులను గుర్తించారు. వీటి గురించి ఆరా తీస్తున్నారు.
తుపాకులు