ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రికార్డు ధర:  రూ. 7వేలకుపైగా పలుకుతున్న క్వింటా వేరుశెనగ - కర్నూలు

కర్నూలు జిల్లా  మార్కెట్ యార్డులో వేరుశెనగ అధిక ధరకు అమ్ముడవుతూ రికార్డులు నెలకొల్పుతోంది.

రికార్డు ధర పలుకుతున్న వేరుశెనగ

By

Published : Sep 28, 2019, 11:24 AM IST

రికార్డు ధర పలుకుతున్న వేరుశెనగ
కర్నూలు జిల్లా మార్కెట్ ఎమ్మిగనూరు యార్డులో ఒక క్వింటాళ్ళ వేరుశెనగ ఏడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయల రికార్డు స్థాయి ధరకు అమ్ముడవుతూ రైతుల్లో ఆశలు నింపుతోంది. ఖరీఫ్ సీజన్​లో సాధరణం సాగు విస్తీర్ణం 79 హెక్టార్లు అయినా జూలై ఆఖరు వరకూ వర్షాలు లేకపోవటంతో సాగు తగ్గింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, వరుస నష్టాలతో కుదేలైన రైతన్నకు ఆశలు సన్నగిల్లి కేవలం సాధరణ సాగులో పావు శాతం హెక్టార్లలోనే సాగైనట్లు వ్యవసాయ అధికారులు వెల్లడించారు. జిల్లాలో 12 మార్కెట్ యార్డులు ఉన్నా ప్రధానంగా ఎమ్మిగనూరు, ఆదోని మార్కెట్లకే రైతులు వేరుశెనగను తీసుకువస్తారు. ప్రస్తుతం ఎమ్మిగనూరు మార్కెట్​లో రికార్డు స్థాయి ధరలకు వేరుశెనగ అమ్ముడవుతుండటంతో నీటి వసతి ఉన్న రైతులు వేరుశెనగ రైతులు విత్తనాల కోసం బారులు తీరుతున్నారు. దీంతో ధర మరింత పెరిగే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details