కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోటలో దస్తగిరి అనే రైతు పొలంగట్ల మీద డీఆర్డీఏ, వెలుగు అధికారులు మొక్కలు నాటారు. అవిశ, సుబాబుల్, మునగ మొక్కలను ఉచితంగానే రవాణా ఖర్చుతో కలిపి పోలంలో నాటించే బాధ్యతను డీఆర్డీఏ, వెలుగు తీసుకుందని అధికారులు తెలిపారు. మూడు నెలలకు ఓసారి పంట చేతికొస్తుందని.. ప్రతి నెల ఆకులను కత్తిరించి గొర్రెలు, పశువులకు వేస్తే 25 శాతం ప్రొటీన్లు అదనంగా అందుతాయని చెప్పారు. రైతులు ఇటువంటి మొక్కలను పెంచుకుంటే పశుగ్రాస కొరత ఇబ్బంది ఉండదని సూచించారు.
ఉచితంగా పశుగ్రాసం మొక్కలు - veldurti
కర్నూలు జిల్లా రామళ్ళకోటలో డీఆర్డీఏ, వెలుగు ఆధ్వర్యంలో సహకార సంఘం సభ్యులు పశుగ్రాస మొక్కలు నాటారు.
పశుగ్రాసం మొక్కలు