Grandson killed his grandfather in AP: అతడు రిటైర్డ్ ఉద్యోగి.. తనకు వచ్చే పెన్షన్‌తో కృష్ణా రామా అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కానీ అతని మనవడు దీపక్ శర్మ మాత్రం ఎలాంటి పనులు చేయకుండా ఇంటోనే ఉండేవాడు. దాంతో మనవడిని ఒకటి.. రెండుసార్లు మందలించాడు ఆ తాత. తనపై తాత పెత్తనం ఎంటనకున్నాడో ఏమో.! తాతను అంతమెుందించాలని నిర్ణయించుకన్నాడు. ఇంట్లో ఎవ్వరు లేని సమయం చూసి తన తాతను హత్య చేశాడు.
పని చేసుకోమంటూ.. విసిగిస్తున్నాడని.. తాతను చంపిన మనవడు..! - ఏపీ నేర వార్తలు
Grandson killed his grandfather: కర్నూలు నగరంలో ఈనెల మూడవ తేదీ జరిగిన సుబ్రహ్మణ్యం శర్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మనవడు దీపక్ శర్మ ఎలాంటి పనులు చేయకుండా ఇంట్లోనే ఖాళీగా కూర్చోవడంతో సుబ్రహ్మణ్య శర్మ మందలించడంతో.. దీపక్ శర్మ హత్య చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
కర్నూలు నగరంలో ఈనెల మూడవ తేదీ జరిగిన సుబ్రహ్మణ్యం శర్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సొంత మనవడే తాతను హత్య చేసినట్లు కర్నూలు డీఎస్పీ. కే వి. మహేష్ తెలిపారు. వ్యవసాయ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ రిటైర్డ్ అయిన సుబ్రహ్మణ్య శర్మ కర్నూలు నగరంలోని మాధవి నగర్ లో నివాసం ఉంటున్నాడు. తన మనవడు దీపక్ శర్మ ఎలాంటి పనులు చేయకుండా ఇంట్లోనే ఖాళీగా కూర్చోవడంతో సుబ్రహ్మణ్య శర్మ మనవడిని తరచూ మందలించేవాడు. పౌరోహిత్యం నేర్చుకోమని చెప్పడంతో పాటుగా తన దగ్గర తీసుకున్న డబ్బుల విషయంలో మనవడిని సుబ్రహ్మణ్యం ప్రశ్నించాడని కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో దీపక్ శర్మ ఇంట్లో ఎవరు లేని సమయంలో గత శనివారం కత్తితో తాతపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలింది. అరెస్టు చేసిన నిందితుడిని రిమాండుకు పంపించినట్లు డీఎస్పీ తెలిపారు.
ఇవీ చదవండి: