ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నీజాయితీగా చెప్పే పాఠాలు, తలపై మొట్టికాయలు గుర్తుకొస్తున్నాయి' - krishna district collector

కర్నూలు జిల్లా కోడుమూరు యూత్​ రిక్రియేషన్​ సెంటర్లో 1980 సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ అభినందన సభ జరిగింది. ఇందులో కృష్ణా జిల్లా కలెక్టర్​ ఇంతియాజ్​ పాల్గొన్నారు. వారి మధుర జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. అనంతరం మిత్రులంతా కలిసి కలెక్టర్​కు సత్కారం చేశారు.

'నీజాయితీగా చెప్పే పాఠాలు, తలపై మొట్టికాయలు గుర్తుకొస్తున్నాయి'

By

Published : Aug 12, 2019, 8:54 AM IST

అప్పట్లో ఉపాధ్యాయులు నిజాయితీగా పాఠాలు చెప్పే వారిని, తలపై మొట్టికాయలు వేసిన మధుర జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయంటూ కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆనందం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరు యూత్ రిక్రియేషన్ సెంటర్లో 1980 సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ అభినందన సభ జరిగింది. తమ మిత్రుడు కలెక్టర్​గా పని చేస్తున్న విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించేందుకు సభను ఏర్పాటు చేశారు.
మిత్రుల ఘన సత్కారం
ఆత్మీయ సభకు హాజరైన కృష్ణా జిల్లా కలెక్టర్​కు తోటి విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. కోడుమూరులో పుట్టి పెరిగిన జ్ఞాపకాలను ఒక్కసారిగా నెమరువేసుకున్నారు. తోటి మిత్రులతో పదో తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన విషయాలను కలెక్టర్ సంతోషంతో చెప్పుకొచ్చారు. మిత్రులు బాధ్యతతో ముందుకు వస్తే 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఊరు అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అప్పటి ఎన్టీఆర్, జయప్రద సినిమాలను మిత్రులకు గుర్తు చేస్తూ మధుర జ్ఞాపకాలు పంచుకున్నారు. అనంతరం మిత్రులు కలెక్టర్​కు ఘనంగా సత్కరించారు.

'నీజాయితీగా చెప్పే పాఠాలు, తలపై మొట్టికాయలు గుర్తుకొస్తున్నాయి'

ABOUT THE AUTHOR

...view details