కర్నూలు జిల్లా నంద్యాలలో రెండు చోట్ల జర్మన్ హ్యాంగర్ గుడారాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ గుడారాలను పరిశీలించిన నంద్యాల సబ్ కలెక్టర్ కల్పన కుమారి.. వీటిని మూడు రోజుల్లో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో ఒకటి, ఎస్సార్బిసీ కాలనిలో క్వారైంటైన్ ఏర్పాటు చేశారు.
నంద్యాలలో అందుబాటులోకి రానున్న జర్మన్ హ్యాంగర్ గుడారాలు - కర్నూలు జిల్లా వార్తలు
కర్నూలు జిల్లా నంద్యాలలో జర్మన్ హ్యాంగర్ గుడారాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మూడు రోజుల్లో వీటిని అందుబాటులోకి తేనున్నట్లు సబ్ కలెక్టర్ కల్పన కుమారి వెల్లడించారు.
జర్మన్ హ్యాంగర్ గుడారాలు
కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న రోగులను గుడారాల్లో ఉంచి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి.. అనంతరం పాజిటివ్ వచ్చిన వారిని కొవిడ్ సెంటర్లకు తరలిస్తారు. రెండు గుడారాల్లో వంద మంది ఉండేలా అధికారులు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి