కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో గంగా పుష్కర ఉత్సవాన్ని నిర్వహించారు. పుష్కరం రావాలంటే 12 సంవత్సరాలు వేచి ఉండాలి. మహానంది పుణ్యక్షేత్రంలో వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగాదేవి తన పాపాలు పోగొట్టుకుని పునీతురాలవుతుందని పురాణాలు తెలుపుతున్నాయి.
దేవస్థానంలోని వేదపండితులు, ఆలయ పర్యవేక్షకులు గంగాదేవి విగ్రహానికి ప్రాకారోత్సవం నిర్వహించారు. పవిత్ర రుద్రగుండం పుష్కరిణిలోని పంచలింగ మంటపంలో గంగాదేవిని ఆవాహన చేసి పూజలు చేశారు. భక్తులంతా గంగా పుష్కర స్నానాన్ని ఆచరించారు.
మహానందిలో గంగా పుష్కర ఉత్సవం - ammavaru
మహానంది పుణ్యక్షేత్రంలో గంగా పుష్కర ఉత్సవాన్ని నిర్వహించారు. గంగాదేవికి ప్రాకారోత్సవం నిర్వహించారు.
గంగా పుష్కరం
ఇది కూడా చదవండి.