కర్నూలు జిల్లా నంద్యాలలో పలు రాష్ట్రాలకు చెందిన.. బ్యాంకు కోచింగ్ కోసం వచ్చిన విద్యార్థులకు అన్నదాన కార్యక్రమ నిర్వాహణ కొనసాగుతోంది. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డితో పాటు పలువురు దాతలు... వారికి అన్నదానం చేస్తున్నారు. ప్రజలు ఇంటికే పరిమితం కావాలని ఎంపీ కోరారు. కొన్ని రోజులు కర్ఫ్యూని పాటిస్తే కరోనా తగ్గుముఖం పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అన్నదానంతో ఆదుకుంటున్న ఆపన్న హస్తాలు - నంద్యాల బ్యాంకు కోచింగ్ విద్యార్థులకు అన్నదానం
నంద్యాల అంటే బ్యాంకు కోచింగ్ కోసం వచ్చే విద్యార్థులే గుర్తుకువస్తారు. పలు రాష్ట్రాల నుంచి ఎందరో విద్యార్థులు వచ్చి ఇక్కడ ఉద్యోగం కోసం సాధన చేస్తుంటారు. లాక్డౌన్ కారణంగా ఇంటికి వెళ్లలేక ఇక్కడే చిక్కుకుపోయిన వారికి పలువురు దాతలు అండగా నిలుస్తున్నారు.
food distribute program for nandyyala bank coatching students at kurnool district