శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా... ప్రాజెక్టుకు 6 లక్షల 80 వేల 510 క్యూసెక్కుల వరద చేరుతోంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 881 అడుగుల నీరు చేరింది. పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలకు గానూ.. 193.4 టీఎంసీల నీరు చేరింది. జలాశయం ఔట్ ఫ్లో 7 లక్షల 78 వేల 848 క్యూసెక్కులుగా నమోదైంది.
శ్రీశైలం జలకళ.. సాగర్‌వైపు కృష్ణమ్మ పరవళ్లు - వరద నీరు
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ఠానికి చేరిన కారణంగా.. వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు.
floods_flow_continue_to_projcects
ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా38,140క్యూసెక్కులు,కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా28,692క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.హంద్రీనీవాకు 2,363 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 28 వేల క్యూసెక్కులు విడుదల చేయగా... ముచ్చుమర్రి నుంచి కేసీ కాలువకు 735 క్యూసెక్కులు పంపారు. మరోవైపు పది గేట్ల ద్వారా నాగార్జున సాగర్‌కు 6 లక్షల 80 వేల 510 క్యూసెక్కుల నీటిని వదిలారు.
Last Updated : Aug 11, 2019, 7:12 PM IST