శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల నుంచి 69,791 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. సుంకేసుల నుంచి 2,215 క్యూసెక్కులు, హంద్రీ నది నుంచి 10,300 క్యూసెక్కులు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయంలో 70,523 క్యూసెక్కుల నీరు చేరింది.
శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం - news on srisailam reservoiur
శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల నుంచి 69,791 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 2,215 క్యూసెక్కులు, హంద్రీ నది నుంచి 10,300 క్యూసెక్కులు విడుదల చేశారు.
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 38,140 క్యూసెక్కులు విడుదల చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 800 క్యూసెక్కులు విడుచేశారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 847.50 అడుగులు ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలు. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వ 74.8120 టీఎంసీలు ఉంది. ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేసి 38,140 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేశారు.
ఇదీ చదవండి: ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్..!