ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దాయాదుల మధ్య ఘర్షణ... ఏడుగురికి గాయాలు - fight between brother

పుట్టు వెంట్రుకల శుభకార్యంలో జరిగిన చిన్నపాటి వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. కర్నూలు జిల్లా నల్లగట్ల గ్రామంలో జరిగిన ఈ గొడవలో ఏడుగురు గాయపడ్డారు.

దాయాదుల మధ్య ఘర్షణ...ఏడుగురికి గాయాలు !
దాయాదుల మధ్య ఘర్షణ...ఏడుగురికి గాయాలు !

By

Published : May 26, 2020, 7:22 AM IST

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల గ్రామంలో దాయాదుల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామంలోని ఓ కుంటుంబంలో జరిగిన పుట్టు వెంట్రుకల శుభకార్యంలో వాగ్వాదం మొదలైంది. అది కాస్తా... ఘర్షణకు దారితీసింది.

ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. దాయాదులు 2 వర్గాలుగా విడిపోయి గొడవ పడిన ఈ ఘటనలో.. ఏడుగురు గాయపడ్డారు. ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details