ఎన్నికల సంఘానికిరాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ ఫిర్యాదు చేశారు. ఓటరు జాబితాలో తమ కుటుంబ సభ్యుల పేర్లు తొలగించారని కర్నూలులో తెలిపారు. ఇది వైకాపా నేతల కుట్రలో భాగమని మంత్రి ఆరోపించారు. ఓట్ల తొలగింపునకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి.
మంత్రి ఫరూక్ ఓటు గల్లంతు
ఓటరు జాబితాలో మా కుటంబ సభ్యుల పేర్లు తొలగించారు. కర్నూలులో పుట్టి పెరిగిన నా పేరే జాబితాలో తీసేస్తే మరీ సామాన్యుల పరిస్థితేంటో నాకు అర్థమవట్లేదు. ఇది కచ్చితంగా వైకాపా కుట్రలో భాగమే. మా ఓట్ల తొలగింపునకు కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి-ఎన్.ఎమ్.డి. ఫరూక్, మంత్రి
రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్
Last Updated : Mar 8, 2019, 7:17 PM IST
TAGGED:
farooq