ఉల్లికి మద్దతుధర కల్పించాలని కోరుతూ.. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో రైతు సంఘం నాయకులు ఆందోళన చేశారు. క్వింటాల్ రూ. 2 వేలకు కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో వ్యాపారస్థులు కుమ్మక్కై.. కావాలనే రైతుల నుంచి తక్కువ ధరకు కొంటున్నారని ఆరోపించారు.
మార్కెట్ కార్యదర్శి జయలక్ష్మిని ఈ విషయంపై ఉల్లి రైతులు ప్రశ్నించగా.. ఎగుమతులు తగ్గిన కారణంగానే ధరలు క్షీణించాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని.. రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు.