ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 21, 2020, 9:40 AM IST

ETV Bharat / state

భూమి లాక్కున్నారన్న ఆవేదనతో రైతు ఆత్మహత్యాయత్నం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పథకం.. కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలంలో వివాదంగా మారింది. కల్లుకుంట గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద రెవిన్యూ అధికారులు భూమిని స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యామ్నాయంగా ఏమీ ఇవ్వని కారణంగా.. రైతు ఆవేదనతో పురుగులమందు తాగాడు. పరిస్థితి విషమించిన కారణంగా.. ఆసుపత్రికి తరలించారు.

పురుగులమందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం
పురుగులమందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం

పురుగులమందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం కల్లుకుంటలో తమ సాగుభూమిని అధికారులు అన్యాయంగా లాక్కున్నారని ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పేదల ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూసేకరణలో భాగంగా... రామంజి అనే రైతుకు చెందిన పొలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యామ్నాయంగా ఏమీ ఇవ్వకపోవటం వల్ల ఆవేదనతో పురుగులమందు తాగాడు. పరిస్థితి విషమించగా.. చికిత్స కోసం ఆదోని ఆసుపత్రికి తరలించారు. తమకు న్యాయం చేయాలని అధికారులను అడిగితే విసిగిస్తున్నారని.... అందుకే పురుగులమందు తాగాడని బాధితుడి భార్య ఆవేదన వ్యక్తం చేసింది.

ABOUT THE AUTHOR

...view details