కర్నూలు జిల్లా చాగలమర్రి మండల కేంద్రంలో అప్పుల బాధతో సుబ్బ నరసయ్య (38) కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మూడేళ్లుగా ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని వివిధ పంటలను సాగు చేస్తున్నాడు. ప్రతి ఏటా వ్యవసాయంలో నష్టం వచ్చింది. వాటిని తీర్చేందుకు అప్పులు చేశాడు. మొత్తం ఏడు లక్షల అప్పు చేయగా... తీర్చే మార్గం లేక సుబ్బ నరసయ్య ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు చాగలమర్రి పోలీసులు కేసు నమోదు చేశారు.
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య - కౌలు రైతు ఆత్మహత్య
కర్నూలు జిల్లా చాగలమర్రి మండలలో కౌలురైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తం ఏడు లక్షల అప్పును తీర్చే మార్గం లేక ఇంట్లోనే ఉరి వేసుకుని మరణించాడు.
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య