ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేపల నకిలీ మేత తయారు చేశారు... టాస్క్​ఫోర్స్​కి చిక్కారు

కర్నూలు జిల్లా పాణ్యంలో బొగ్గు, ప్లాస్టిక్​తో తయారుచేసిన బంకతో చేపలకు నకిలీ మేతను తయారుచేస్తున్న ఓ పరిశ్రమపై.. టాస్క్​ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తయారుచేస్తున్న మేతను సీజ్ చేశారు. పరిశ్రమను మూసివేసిన అధికారులు.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Fake feed factory seized in panyam kurnool
నకిలీ చేపల మేతలు చేశారు... టాస్క్​ఫోర్స్​కి చిక్కారు

By

Published : Dec 17, 2019, 10:24 PM IST

నకిలీ చేపల మేతలు చేశారు... టాస్క్​ఫోర్స్​కి చిక్కారు

కర్నూలు జిల్లా పాణ్యం సమీపంలోని ఇండియన్ బయో ఆక్వా పౌల్ట్రీ ఫీడ్ పరిశ్రమలో.. చేపలకు నకిలీ మేతలను తయారుచేస్తున్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ కమిటీ దాడులు నిర్వహించింది. మత్స్యశాఖ జేడీ లాల్‌ మహ్మద్‌, ఫుడ్ సేఫ్టీ అధికారి దేవరాజు, ఎమ్మార్వో అనురాధ, అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనల ప్రకారం ముడి సరుకులు వాడకుండా బొగ్గు, ప్లాస్టిక్‌తో తయారైన బంక తదితర పదార్థాలను ఉడికించి మేతలను తయారుచేస్తున్నట్లు గుర్తించారు.

రెండు సంవత్సరాల నుంచి పరిశ్రమ నడుస్తున్నట్లు, ఈ పరిశ్రమ ద్వారా తయారుచేసే మేతను గోదావరి జిల్లాలు, తెలంగాణలోని పలు జిల్లాలకు సరఫరా చేస్తున్నారన్నారు. నంద్యాల ప్రాంతానికి చెందిన కొందరు రైతులు మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం వలన దాడులు చేశామని అధికారులు తెలిపారు. 4 టన్నుల ముడిసరుకు, రెండున్నర టన్నుల మేతను సీజ్ చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యంపై చట్టప్రకారం చర్యలు చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details