కర్నూలు జిల్లా నంద్యాల శ్రీ కాళికాంబ ఆలయం, ఆళ్లగడ్డలోని అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో దసరా పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారికి, శ్రీదేవి భూదేవి సహిత ప్రహ్లాద వరద స్వామికి అర్చకులు విశేష పూజలు చేశారు. అహోబిలం 46వ పీఠాధిపతి శ్రీ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఈ పూజలు నిర్వహించడం విశేషం... క్షేత్రం మొదటి పీఠాధిపతి జయంతి సందర్భంగా ఆయన విశేష పూజలు చేశారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు
దసరా పురస్కరించుకుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి... ముగుస్తాయి. కానీ దసరా వేషాలు లేని దసరా పండుగను ఉహించుకోలేం. ఈ వేషాలను నంద్యాలలో ప్రదర్శించారు. వేషాలు కనుమరుగవుతున్న తరుణంలో ఉప్పరిపేట యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు కాలనీల్లో జరిగిన ఈ ప్రదర్శనను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. భద్రకాళి రూపంలో వేషం.. రాక్షసులను సంహరించే తీరు డప్పుల శబ్దాలు.. నృత్యాలతో అలరించారు.