డంపింగ్ యార్డులు ప్రజలకు ఉపయోగపడేలా చేస్తాం! - undefined
కాలం చెల్లిన డంపింగ్ యార్డులు ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్రస్థాయి పారిశుద్ధ్య నిర్వహణ కమిటీ ఛైర్మన్, విశ్రాంత న్యాయమూర్తి శేషశయనారెడ్డి అన్నారు.
కాలం చెల్లిన డంపింగ్ యార్డులను ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర స్థాయి పారిశుద్ధ్య నిర్వహణ కమిటీ ఛైర్మన్, విశ్రాంత న్యాయమూర్తి శేషశయనారెడ్డి అన్నారు. కడప శివారులోని పాత డంపింగ్ యార్డును పార్కు మాదిరి తయారు చేస్తున్నారు. ఈ మేరకు అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను శేషశయనారెడ్డి పరిశీలించారు. 15 లోపు పనులను పూర్తి చేసి అప్పగిస్తామని నిర్వాహకులు ఆయనకు స్పష్టం చేశారు. గతంలో అక్కడ డంపింగ్ యార్డ్ ఉండేదని... ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని నగరానికి 16 కిలోమీటర్ల దూరానికి తరలించామని చెప్పారు. ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్కును తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
TAGGED:
dumping