కర్నూలు జిల్లా ఆదోనిలో పురోహితులకు డీఎస్పీ వినోద్ కుమార్ పాసులు జారీ చేశారు. ఈ నెలలో వివాహాలు, శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయి. కర్ఫ్యూ ఆంక్షలు అమలవుతున్న ఈ సమయంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు హాజరయ్యేందుకు ఇబ్బందులు లేకుండా పట్టణంలోని 21 మంది పురోహితులకు పాసులు అందించినట్లు డీఎస్పీ తెలిపారు. వివాహాలకు తెల్లవారు జామున, రాత్రి సమయాల్లో వెళ్లాల్సి వస్తుందని.. ఇలా పాసులు ఇవ్వడం వల్ల ఇబ్బంది ఉండదని పురోహితులు పేర్కొన్నారు.
ఆదోనిలో పురోహితులకు పాసులు జారీ - adoni latest news
రాష్ట్రంలో కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అత్యవసరాల కోసం బయటకు వెళ్లే వారు ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పెళ్లిళ్ల సమయం కావటంతో కర్నూలు జిల్లా ఆదోనిలో పురోహితులకు డీఎస్పీ వినోద్ కుమార్ పాసులు జారీ చేశారు.
పాసులు చూపిస్తున్న పురోహితులు