ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కల్లూరు, ఓర్వకల్లు మండలాలను జిల్లా నుంచి విడదీయెుద్దు'

కర్నూలు జిల్లాలోని కల్లూరు, ఓర్వకల్లు మండలాలను జిల్లా నుంచి విడదీస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని ఎంపీ సంజీవ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా 2 మండలాలను జిల్లాలోనే ఉంచేలా చర్యలు తీసుకోవాలని అన్ని పార్టీలకు చెందిన ప్రతినిధులు ఎంపీని కలిసి వినతి పత్రం అందజేశారు.

కర్నూలు నుంచి కల్లురు, ఓర్వకల్లు మండలాలను విడదీయెుద్దు
కర్నూలు నుంచి కల్లురు, ఓర్వకల్లు మండలాలను విడదీయెుద్దు

By

Published : Sep 7, 2020, 7:25 PM IST

కల్లూరు, ఓర్వకల్లు మండలాలను కర్నూలు జిల్లా నుంచి విడదీస్తే ప్రజలు ఇంకా నష్ట పోయే ప్రమాదం ఉందని ఎంపీ సంజీవ్ కుమార్ అన్నారు. కల్లూరు మండలంలోని 16 వార్డులు కర్నూలు నగరంలోనే కలిసి పోయాయన్నారు.

ఈ 2 మండలాలు కర్నూలులోనే ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఎంపీకి వినతిపత్రం సమర్పించారు. సీఎం జగకు ఈ సమస్యను వివరిస్తానని ఎంపీ సంజీవ్ వారికి హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details