కర్నూలు విమానాశ్రయంలో పౌర విమాన సేవలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతి మంజూరు చేసింది. మార్చి నెల నుంచి విమానాల రాకపోకలకు అనుమతి మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్ పోర్టులో ఏరో డ్రోమ్ నిర్వహణకు గానూ ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ అనుమతినిచ్చారు.
మార్చి నుంచి కర్నూలు విమానాశ్రయ సేవలు ప్రారంభం
కర్నూలు విమానాశ్రయంలో త్వరలోనే పౌర విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. మార్చి నుంచి విమానాల రాకపోకలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతినిచ్చింది.
మార్చి నుంచి కర్నూలు విమానాశ్రయ సేవలు ప్రారంభం
విమాన రాకపోకలకు అనుమతులు రావటం శుభపరిణామమని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. రాష్ట్రప్రభుత్వం విమానాశ్రయ అభివృద్ధికి రూ.150 కోట్లు వెచ్చించినట్టు మంత్రి వెల్లడించారు.
ఇదీ చదవండి