ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దళితులు ఫిర్యాదులు చేస్తే పోలీసులు తీసుకోట్లేదు'

దళితుల ఫిర్యాదులు పోలీసులు తీసుకోట్లేదని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో హత్యకు గురైన యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబాన్ని ఆదోని ఆర్డీవో రామకృష్ణ పరామర్శించారు.

Dalit groups protest against adoni murder case
దళితులు ఫిర్యాదులు చేస్తే పోలీసులు తీసుకోట్లేదు

By

Published : Jan 1, 2021, 4:58 PM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణ హత్యకు గురైన దళిత యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్​కు వెళ్తే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పరామర్శ..

ఆసుపత్రి వద్ద ఉన్న బాధిత కుటుంబాన్ని ఆదోని ఆర్డీవో రామకృష్ణ పరామర్శించారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని ఆర్డీవో హామీ ఇచ్చారు.

కేసు నమోదు చేశాం..

బాధితురాలు మహేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. ఈ హత్యకు కారకులైన మహేశ్వరీ పెద్ద నాన్న పెద్ద ఈరన్న, తండ్రి చిన్న ఈరన్నను అదుపులో తీసుకున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి:ఆదోనిలో పట్టపగలే తలపై బండరాయితో మోది దళిత యువకుడి హత్య

ABOUT THE AUTHOR

...view details