కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతన్నల పాలిట శాపంగా మారింది. వరి ధాన్యం, మొక్కజొన్న జొన్న పంటలు కోసి ఆరబోయగా వర్షంలో అంతా తడిసిపోయింది. ప్లాస్టిక్ కవర్లు కప్పినా వర్షం అధికంగా పడిన కారణంగా.. నీరు లోపలికి వెళ్లి ధాన్యాన్ని తడిపేసింది.
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి గ్రామాల్లో పర్యటించారు. పంట నష్టాన్ని పరిశీలించారు. రైతులు తమకు జరిగినగిన నష్టాన్ని చెప్పుకుని ఆవేదన చెందారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే.. పంటనష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తప్పక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.