రాష్ట్రంలో వరదలతో నష్టపోయిన బాధిత కుటుంబానికి ప్రభుత్వం వెంటనే పరిహారం ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలోని సీపీఐ కార్యాలయంలో మాట్లాడిన ఆయన జిల్లాలో బాధిత కుటుంబానికి రూ.5 వేలు, దెబ్బతిన్న ప్రతి ఎకరాకు రూ.20 వేలు ఇవ్వాలని పేర్కొన్నారు. కర్నూలు వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించాలని అన్నారు. కేంద్రం ఆంధ్రాబ్యాంకును ఇతర బ్యాంకుల్లో విలీనం చేయడం తగదని అన్నారు. యురేనియ తవ్వకాలపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారన్న ఆయన... దీనికి వ్యతిరేకంగా ఈ నెల 29న విజయవాడలో తెలుగు రాష్ట్రాల నాయకులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
'కర్నూలు వరద ప్రాంతాల్లో సీఎం పర్యటించాలి' - cpi ramakrishna press meet
రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించాలని విజ్ఞప్తి చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కర్నూలు జిల్లాలో వరద బాధిత కుటుంబాలకు రూ.5 వేలు, దెబ్బతిన్న ప్రతి ఎకరాకు రూ.20 వేలు ఇవ్వాలని అన్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఈ నెల 29న విజయవాడలో తెలుగు రాష్ట్రాల నాయకులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
సీపీఐ రామకృష్ణ