కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డు పత్తి దిగుబడులతో కళకళలాడుతోంది. ఆక్టోబరు ప్రారంభం నుంచి క్వింటాలు రూ.8 వేలకు పైగా పలుకుతుండటంతో తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక నుంచి రైతులు వస్తున్నారు. గురువారం 8,009 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా కనిష్ఠ ధరే రూ.7,000 నమోదైంది. గరిష్ఠంగా రూ.8,461, మధ్యస్త ధర రూ.8,129 పలకడంతో అన్నదాతల మోముల్లో ఆనందం కనిపిస్తోంది.
తెల్లబంగారం రైతు ‘ధర’హాసం..! - ఏపీ తాజా వార్తలు
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డు పత్తి దిగుబడులతో కళకళలాడుతోంది. ఆక్టోబరు ప్రారంభం నుంచి క్వింటాలు రూ.8 వేలకు పైగా పలుకుతుండటంతో తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక నుంచి రైతులు వస్తున్నారు.
Marketyard cotton