కర్నూలు జిల్లా బనగానపల్లెలో కరోనా వైరస్ కేంద్ర బృందం సభ్యులు మధుమిత దుబే, సంజయ్ కుమార్, సాధుఖాన్లు పర్యటించారు. బనగానపల్లె పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. వైరస్ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించారు. లాక్‌డౌన్ అనంతరం తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై మాట్లాడారు.
కరోనా నుంచి కోలుకున్న కుటుంబాల వివరాల తెలుసుకున్నారు. అనంతరం రెడ్‌జోన్ ప్రాంతాల్లో పర్యటించి... ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. కీలక సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి వైరస్ నివారణకు చేయూత ఇవ్వాలని కోరారు. అనంతరం యాగంటి బయలుదేరి వెళ్లారు.