కర్నూలు జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం జిల్లాలో కొత్తగా 834 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటి వరకు జిల్లాలో 33,580 మందికి కరోనా సోకింది.
వీరిలో 25,458 మంది మహమ్మారి నుంచి కోలుకోగా... 7830 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శాంతిరాం కొవిడ్ ఆసుపత్రి నుంచి ఆదివారం 20 మంది డిశ్చార్జ్ అయ్యారు.