ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సిబ్బంది లేకపోవడంతో...మూలనపడిన కరోనా పరీక్షల నిర్వహణ

నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షల నిర్వహణ మున్నాళ్ల ముచ్చటగా మారింది. కరోనా విజృంభిస్తున్నందున పరీక్షలు ఎక్కువ చేయాల్సి ఉంది. ప్రభుత్వ వైద్యశాలలో  సిబ్బంది లేమి కారణంగా యంత్రాలు పక్కన పెట్టేసిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రయోగశాల మూసివేతకు కారణమైంది.

Corona tests were not performed due to lack of staff at nandyala
మూలకుపడిన కరోనా పరీక్షల నిర్వహణ

By

Published : Aug 14, 2020, 9:13 AM IST



కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలో ఏప్రియల్ 15 న కరోనా వైరస్ నిర్దారణకు ప్రత్యేక ప్రయోగశాల ఏర్పాటు చేశారు. లక్షలు వెచ్చించి ఐదు నూతన. " ట్రూనాట్ " యంత్రాలను కేటాయించారు. 28 మంది ల్యాబ్ టెక్నిషియన్లతో ఈ నెల 4 వతేది వరకు ఆ యంత్రాలతో పరీక్షలు కొనసాగాయి. తిరిగి ఆ సిబ్బందిని వారు పనిచేసే ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు పంపించారు. ఈ కారణంగా పరీక్ష చేసే వారు లేకపోవడంతో ప్రయోగశాల మూసివేశారు. పది రోజులుగా పరీక్షలు చేయట్లేదు. ఈ యంత్రాలతో గంటకు 12 మందికి కరోనా పరీక్షలు చేసే వెసులుబాటు ఉంటుంది. త్వరలోనే ఈ యంత్రాలతో పరిక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details