కర్నూలు నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. జిల్లాలో 411 కేసులు నమోదు కాగా అందులో అత్యధికంగా కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోనే 250 ఉన్నాయి. నంద్యాల మున్సిపాలిటీ పరిథిలో 79 కేసులు నమోదయ్యాయి. ఈరోజు కొత్తగా జిల్లాలో 25 పాజిటివ్ కేసులు గుర్తించారు. ఇందులో కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 19, నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
జిల్లాలో కొత్తగా 25 కరోనా పాజిటివ్ కేసులు - కర్నూలు జిల్లాలో కరోనా కేసులు
కర్నూలు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కొత్తగా 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో చాలా వరకు నగర పరిథిలోనే నమోదవుతున్నాయి.
corona cases