'తెదేపాలో వర్గ విభేదాలు' - కేఈ కృష్ణమూర్తి
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజక వర్గం తెదేపాలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కేఈ కృష్ణమూర్తి, తుగ్గలి నాగేంద్ర వర్గాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి.
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తెదేపాలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కేఈ కృష్ణమూర్తి, తుగ్గలి నాగేంద్ర వర్గాల మధ్య వివాదం ముదురుతోంది. తమకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని తుగ్గలి నాగేంద్ర కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తనపై కేసులు పెట్టించి.. ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ తుగ్గలి నాగేంద్ర ఆరోపిస్తున్నారు. రాష్ట్ర శాలివాహన ఫెడరేషన్ ఛైర్మన్ గా తుగ్గలి నాగేంద్ర పనిచేశారు. నేడు జెడ్పీటీసీ పదవికి నాగేంద్ర భార్య వరలక్ష్మీ రాజీనామా చేయనున్నారు. సీఎంతో మాట్లాడిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు నాగేంద్ర తెలిపారు.