కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. బృహస్పతి మకరరాశిలో ప్రవేశించాక..ఒంటిగంటా 21 నిముషాలకు ముఖ్యమంత్రి జగన్ పుష్కరాలను ఆరంభించనున్నారు. అనంతరం నదిలో ప్రత్యేక పూజలు నిర్వహించి... హోమంలో పాల్గొననున్నారు.
కాసేపట్లో కర్నూలులో తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించనున్న సీఎం - pushkaralu in kurnool news
కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు మరికొద్దిసేపట్లో ఆరంభమనున్నాయి. ముఖ్యమంత్రి జగన్ పుష్కరాలను ప్రారంభించనున్నారు.
కర్నూలు ఘాట్ వద్ద ఏర్పాట్లు
కరోనా కారణంగా పుణ్యస్నానాలు, జల్లు స్నానాలను ప్రభుత్వం నిషేధించింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... పిండప్రదానాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి అనుమతిచ్చారు. పుష్కరాల్లో పాల్గొనేవారు ఈ- టికెట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.
ఇదీ చదవండి: మంత్రాలయంలో ఘనంగా ప్రారంభమైన తుంగభద్ర పుష్కరాలు