కేంద్ర మాజీ మంత్రికోట్ల కుటుంబం తెదేపాలో చేరడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా రాజకీయాలన్నీ కోట్ల, కేఈ కుటుంబాలమధ్యే తిరిగాయన్నారు.ఈ రెండుకుటుంబాలు కలవడాన్ని ఓచరిత్రగా చెప్పారు. కేఈ మాదన్న, కోట్ల విజయభాస్కరరెడ్డి విలువలతో కూడిన రాజకీయాలు చేశారన్నారు.ఎన్టీఆర్‌కు కోట్ల విజయభాస్కరరెడ్డి చాలా సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. తానూ విజయభాస్కరరెడ్డి క్యాబినెట్‌లో పనిచేశానని సీఎం చెప్పారు. కేఈ ఎప్పుడూ కర్నూలు జిల్లా సాగునీటి ప్రాజెక్టుల గురించే మాట్లాడేవారని తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసమే తెదేపాలోకి సూర్యప్రకాశ్‌రెడ్డి వచ్చారని స్పష్టం చేశారు.