వేదావతి ప్రాజెక్టు వల్ల 80 వేల ఎకరాలకు నీరు వస్తాయని... ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని సీఎం చెప్పారు. ఆర్డీఎస్ కుడికాలువ ప్రాజెక్టు పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచామని తెలిపారు. కర్నూలు జిల్లా ప్రజల కలలు సాకారం చేసే బాధ్యత తెదేపా ప్రభుత్వం తీసుకుందన్నారు . గుండ్రేవుల ప్రాజెక్టు వల్ల 20 టీఎంసీల నీళ్లు వస్తాయన్నారు. ప్రాజెక్టుతో కేసీ కెనాల్ ఆయకట్టు మొత్తం స్థిరీకరణ జరుగుతుందని తెలిపారు.
రతనాల'సీమ'గా మారుస్తా!
కర్నూలు జిల్లా ప్రజల కలలు సాకారం చేసే బాధ్యతను తెదేపా ప్రభుత్వం తీసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వేదావతి ప్రాజెక్టు వల్ల కర్నూలులో 80 వేల ఎకరాలకు నీళ్లు వస్తాయన్నారు. వేదావతి ప్రాజెక్టుతో కర్నూలు ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. తాను, కేఈ, సూర్యప్రకాశ్‌రెడ్డి ముగ్గురూ రాయలసీమ బిడ్డలమేనని... రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని హామీ ఇచ్చారు.
కోడుమూరు సభలో చంద్రబాబు ప్రసంగం
ఒకేరోజు రూ.8,100 కోట్ల విలువైన ప్రాజెక్టులకు పునాది వేయడం తన అదృష్టమని ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. రాయలసీమకు 214 టీఎంసీల సాగునీరు ఇచ్చామని స్పష్టం చేశారు.తాను, కేఈ, సూర్యప్రకాశ్‌రెడ్డి ముగ్గురూ రాయలసీమ బిడ్డలమేనని...రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని హామీ ఇచ్చారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ వచ్చేందుకు... పత్తికొండ, డోన్, ఆలూరులోని 62 చెరువులకు నీరిచ్చేందుకు కృషిచేస్తామని తెలిపారు.