క్రైస్తవులను రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ కర్నూల్లో పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట క్రైస్తవులు ఆందోళన చేపట్టారు. క్రైస్తవుల మనోభావాలకు దెబ్బతీసేలా.. భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మాట్లాడారని, వారిని కేంద్ర ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. క్రైస్తవులకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, తమను అవమాన పరచిన వారికి ఓటు ద్వారా బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు.
'క్రైస్తవులను అవమానపరిస్తే ఓటు ద్వారా బుద్ధి చెబుతాం' - ఎంపీ బండి సంజయ్
క్రైస్తవులను అవమాన పరచిన వారికి ఓటు ద్వారా బుద్ధి చెబుతామని కర్నూల్లో పాస్టర్స్ అసోసియేషన్ వారు హెచ్చరించారు. క్రైస్తవులను రాజకీయాల్లోకి లాగొద్దంటూ.. కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. క్రైస్తవుల మనోభావాలకు దెబ్బతీసేలా మాట్లాడిన బండి సంజయ్‌పై కేంద్రం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ముందు క్రైస్తవులు ఆందోళన