శ్రీశైలంలో కుమారస్వామి ఆలయ నిర్మాణానికి మళ్లీ పనులను ప్రారంభించారు. ఏనుగు చెరువుకట్ట వద్ద నిర్మాణం ఆపాలని ఇప్పటికే హైకోర్టు స్టేటస్ కో తెలిపింది. కొన్నిరోజులుగా ట్రస్టు సిబ్బంది సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేస్తోంది. విషయం తెలుసుకున్న భాజపా నాయకుడు బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి నిర్మాణ పనులను అడ్డుకున్నాడు. ట్రస్టు సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
SRISAIALM KUMARASWAMY TEMPLE: ఆలయ నిర్మాణ పనులను అడ్డుకున్న బుడ్డా శ్రీకాంత్ రెడ్డి - ap latest news
శ్రీశైలం కుమారస్వామి ఆలయ నిర్మాణం కోసం ట్రస్టు సిబ్బంది సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేస్తోంది. ఈ విషయం గుర్తించిన భాజపా నాయకుడు బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి నిర్మాణ పనులను అడ్డుకునేందుకు యత్నించగా... పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆలయ నిర్మాణ పనులను అడ్డుకున్న బుడ్డా శ్రీకాంత్ రెడ్డి
TAGGED:
SRISAIALM KUMARASWAMY TEMPLE