ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విషాదం: బావిలో స్నానానికి వెళ్లి బాలుడు మృతి - boy dead

కర్నూలు జిల్లా కందనాతిలో బావి వద్ద స్నానానికి వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

Baludu mruthi
బావిలో స్నానానికి వెళ్లి బాలుడు మృతి

By

Published : Jul 4, 2021, 12:00 AM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని కందనాతిలో నాసిర్ హుసేన్(15) అనే బాలుడు మృతితో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. బావిలో స్నానానికి వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు బాలుడి శవాన్ని బావి నుంచి బయటకు తీశారు. బాలుడిది సొంతూరు ఎమ్మిగనూరని తెలుస్తోంది. పొట్టకూటికోసం గ్రామంలోని ఓ చికెన్ దుకాణంలో పని చేస్తున్నాడు. బాలుడు మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details